నీ ముఖము మనోహరము

నీ ముఖము మనోహరము – నీ స్వరము మాధుర్యమునీ పాదాలు అపరంజి మయము

యేసయ్యా నా ప్రాణ ప్రియుడా – మనగలనా నిను వీడి క్షణమైన

 

1. నీవే నాతోడువై నీవే నాజీవమై – నా హృదిలోన నిలిచిన జ్ణాపికవై

అణువణువున నీకృప నిక్షిప్తమై నను ఎన్నడు వీడని అనుబంధమై “యేసయ్య “

 

2. నీవే నా శైలమై నీవే నాశృంగమై – నా విజయానికే నీవు భుజబలమై

అనుక్షణమున శత్రువుకు ప్రత్యక్షమై నను వెనుదీయనీయక వెన్ను తట్టినావు “యేసయ్య”

 

3. నీవే వెలుగువై నీవే ఆలయమై – నా నిత్యత్వమునకు ఆద్యంతమై

 

అమరలోకాన శుద్ధులతో పరిచయమై నను మైమరచి నేనేమి చేసేదనో “యేసయ్య”