నీ మాట వినాలనీ నా హృదయ ఆశ

నీ మాట వినాలనీ నా హృదయ ఆశ

నీసేవ చేయాలనీ నా జీవిత ధ్యాస ॥2

అను.ప:మాట్లాడుము నాతో మాట్లాడుము

మౌనముగానుండకుము ప్రభువా -నాతో మాట్లాడు దైవమా

1.ఇన్నాళ్ళు నీకృపకొరకు ఎదురుచూచు చుంటిని

ఇన్నాళ్ళు నీరాక కొరకు

కనిపెట్టుచుంటినీ

నీ శక్తితో నన్ను బలపరచునట్లు

నీ ఆత్మతో నన్ను నింపు  2॥ ॥మాట్లాడుము॥

2సంగీతములతో కీర్తనలతో  నిన్ను ఆరాధించాలనీ

నీ సువార్తను ప్రకటించుచూ నీసేవను

నేను చేయాలనీ

ఆలకించవా నా మొరనాలకించవా

 

మౌనముగా నుండకుము ప్రభువా॥2మాట్లాడుము ॥