నీ మాట నా పాటగా -అనుక్షణం పాడని

నీ మాట నా పాటగా -అనుక్షణం పాడని

లోకాన నిను చాటగా- నా స్వరం వాడని

నా గీతం ఆత్మలను -నీ వైపే ఆకర్షించనీ

ఆదరణ కలిగించి నీలోనే ప్రహర్షించని

1 ఏ చోట గళమెత్తిన నీ ప్రేమ ధ్వనియించని

పాడేటి ప్రతి పాటలో నీ రూపు కనిపించని

వినిపించుచున్నపుడే ఉద్రేకమును రేపక

స్థిరమైన ఉజ్జీవము లోలోన రగిలించని

2 నీ దివ్య గానామృతం జలధారలుగా పొంగని

తాకేటి ప్రతి వారిని పాలవంతముగా మార్చని

శృతిలయలు లోపించక విసిగింపు కలిగించక

నిజమైన ఉల్లాసమై నిలువెల్లా కదిలించని

3ఆత్మీయ గీతాలతో తనువంత పులకించని

సంగీతమే బోధయై కనువిప్పు కలిగించని

కళాక్షేపము కోసమే  పరిమితం కాకుండగా

 

హృదయాల్లో నివచించుచు కార్యాలు జరిగించని