నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే

నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే

నీ దశమా భాగమునీయ వెనుదీతువా వెనుదీతువా       ||నీ ధనము||

 

ధరలోన ధన ధాన్యముల నీయగా

కరుణించి కాపాడి రక్షింపగా (2)

పరలోక నాధుండు నీకీయగా

మరి యేసు కొరకీయ వెనుదీతువా          ||నీ ధనము||

 

పాడిపంటలు ప్రభువు నీకీయగా

కూడు గుడ్డలు నీకు దయచేయగా (2)

వేడంగ ప్రభు యేసు నామంబును

గడువేల ప్రభుకీయ నో క్రైస్తవా        ||నీ ధనము||

 

వెలుగు నీడలు గాలి వర్షంబులు

కలిగించె ప్రభు నీకు ఉచితంబుగా (2)

వెలిగించ ధర పైని ప్రభు నామము

కలిమి కొలది ప్రభున కర్పింపవా          ||నీ ధనము||

 

కలిగించె సకలంబు సమృద్దిగా

తొలగించె పలుభాధ భరితంబులు (2)

బలియాయె నీ పాపముల కేసువే

 

చెలువంగ ప్రభుకీయ చింతింతువా        ||నీ ధనము||