నీ దేవుడేడంచు నిన్నడుగుచున్నాడు ఎక్కడున్నావని చెప్పను

నీ దేవుడేడంచు నిన్నడుగుచున్నాడు ఎక్కడున్నావని చెప్పను

ఎలా ఉన్నావని చూపను – యేసు(2)

1.ఆకసముల నడుగరాదా – అంతరిక్షము చెప్పలేదా

యేసురాజే సృష్టికర్తయని

యేసునాధుడే సార్వభౌముడని

అంతరిక్షము చెప్పలేదా – ఆకసముల నడుగరాదా”నీ”

2.నక్షత్రముల నడుగరాదా – సాక్షులై అవి చెప్పలేదా

యేసురాజే దేవుడని

విశ్వమంతా యేసు సృష్టియని

సాక్షులై అవి చెప్పలేదా – నక్షత్రముల నడుగరాదా”నీ”

3.మానవాత్మను అడుగరాదా – అంతరాత్మ చెప్పలేదా

యేసు దేవుడే నిన్ను చేసేనని

యేసు లేనిదే ఏది కలుగదని

అంతరాత్మ చెప్పలేదా – మానవాత్మను అడుగరాదా”నీ”

4.దైవవాక్యం చదువరాదా – వాక్య సత్యం చెప్పలేదా

యేసు ప్రజల రాక్షకుడని

యేసే ప్రజల విమోచకుడని

 

వాక్యసత్యం చెప్పలేదా – దైవవాక్యం చదువరాదా”నీ”