నీ జల్దరు వృక్షపు నీడలలో – నేనానంద భరితుడనైతిని

నీ జల్దరు వృక్షపు నీడలలో

నేనానంద భరితుడనైతిని (2)

బలు రక్కసి వృక్షపు గాయములు (2)

ప్రేమా హస్తములతో తాకు ప్రభు (2)     ||నీ జల్దరు||

 

నా హృదయపు వాకిలి తీయుమని

పలు దినములు మంచులో నిలచితివి (2)

నీ శిరము వానకు తడిచినను (2)

నను రక్షించుటకు వేచితివి (2)    ||నీ జల్దరు||

 

ఓ ప్రియుడా నా అతి సుందరుడా

దవళ వర్ణుడా నాకతి ప్రియుడా (2)

వ్యసనా క్రాంతుడుగా మార్చబడి (2)

 

నీ సొగసును నాకు నొసగితివి (2)      ||నీ జల్దరు||