నీ చల్లనైన నీడలో నన్ను నివసించనీ ప్రభు

నీ చల్లనైన నీడలో నన్ను నివసించనీ ప్రభు

నీ పరిశుద్ధ పాదములే నన్ను తాకనీ ప్రభు (2)

నీ ప్రేమా నా లోనా (2)

ప్రతిక్షణం అనుభవించనీ (2)          ||నీ చల్లనైన||

 

మట్టి వంటిది నా జీవితం

గాలి పొట్టు వంటిది నా ఆయుషు (2)

పదిలముగా నను పట్టుకొని (2)

మార్చుకుంటివా నీ పోలికలో (2)

మరణ భయమిక లేదంటివి (2)          ||నీ చల్లనైన||

 

మారా వంటిది నా జీవితం

ఎంతో మదురమైనది నీ వాక్యం (2)

హృదయములో నీ ప్రేమా (2)

కుమ్మరించుమా జుంటి తేనెలా (2)

(ఆహా) మధురం మధురం నా జీవితం (2)          ||నీ చల్లనైన||

 

అల్పమైనది నా జీవితం

ఎంతో ఘనమైది నీ పిలుపు (2)

నీ సేవలో నే సాగుటకు (2)

నను నింపుమా నీ ఆత్మ శక్తి తో (2)

 

నే ఆగక సాగెద నీ సేవలో (2)          ||నీ చల్లనైన||