నీ కృప నాకు చాలును

 

నీ కృప నాకు చాలును 

నీ కృప నాకు చాలును(2) 

అప:- యేసయ్యా  యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) 

 

1) ఓర్పు సహనముల్ నాకిచ్చితివి 

విశ్వాసమును బలపరచితివి(2) 

నా కన్నుల కన్నీరు తుడచితివి 

పరిశుద్ధాత్మను నొసగితివి ( యేసయ్యా) 

 

2) కృప గల దేవా కల్వరి నాధా 

మహిమతో నీవు విచ్చేయు వేళ (2) 

నా మొర ఆలకించి వచ్చితివా 

ఆల్ప ఓ మేఘా దేవుడవై (2) ( యేసయ్యా) 

 

3) యుగయుగములకు తరతరములకు 

నీ కృప నిలుచును శాశ్వతముగ (2) 

కొండలు కూలినా తారలు రాలినా 

నీ రాజ్యము నిలుచును సంపూర్ణంగా (2)( యేసయ్యా)