నీ కృప చాలును-నీ ప్రేమ చాలును

నీ కృప చాలును-నీ ప్రేమ చాలును – నీవు నాకు తోడుంటే-చాలును యేసు “2′

నీవు లేని జీవితం-అంధకార బంధురం “2″

నీవు నాకు తోడుంటే-చాలును యేసు “2″

 

1. శోధనలు ఎన్నియో-వేదనలు ఎన్నియో

నన్ను కృంగదీయు సంకటములెన్నియో “2″

నీ ప్రేమ వర్షం నా స్ధితి ని మార్చెగా “2″ –

నా జీవితాంతము నీలోనే నిలిచెదన్

నా జీవితాంతము నీతోనే నడిచెదన్

నీవు నాకు తోడుంటే చాలును యేసు-2

 

2. నా ప్రేమ గీతం, నా దీన ప్రార్ధన-

నా హృదయ ఆలాపన అందుకో దేవా “2″

నిను పోలి నేను ఈ లోకమందు-నీ సాక్షిగాను నీ మహిమ చాటెదన్ “2″

నీ దివ్య వాక్యం ఈ జగాన చాటెదన్-

 

నీ ఆత్మ అభిషేకం నాకు నొసగు దేవా “2″    “నా ప్రేమ గీతం”