నీవే నా ప్రాణము నీవే నా సర్వము

నీవే నా ప్రాణము నీవే నా సర్వము

నీవే నా జీవము యేసయ్యా (2)

మరువలేను నీదు ప్రేమ

విడువలేనయ్యా నీ స్నేహం (3)        ||నీవే||

 

మార్గం నీవే సత్యం జీవం నీవే

జీవించుటకు ఆధారం నీవే (2)

అపాయము రాకుండా కాపాడువాడవు

నిను నేను ఆరాధింతున్ (2)             ||నీవే||

 

తోడు నీవే నా నీడ నీవే

నిత్యం నా తోడుగుండె చెలిమి నీవే (2)

బ్రతుకంతా నీ కొరకై జీవింతును

 

నిను నేను ఆరాధింతున్ (2)             ||నీవే||