నీవే నాకు దేవుడవు -నీకే నాదు స్తోత్రములు

నీవే నాకు దేవుడవు -నీకే నాదు స్తోత్రములు

స్తోత్రార్హుడవు నీవే నయ్యా (2)-స్తుతుల నీకే చెల్లించెదను

1.      పాపిని నన్ను రక్షించుటకు-పరము నుండి భువికేతెంచే

సిలువలోన రక్తము(2)-పాపమంత కడిగినావు||నీవే||

2.      మంచి కాపరి నీవే నవ్వయ్యా- నాకు తోడు నీవేనయ్యా

నీవు నన్ను నడిపించెదవు-నాకు భయము లేదిలలోన||నీవే||

3.      కష్టములలో కన్నీరులలో-కనికరించి కాపాడితివి

అభయమిచ్చి ఆదరణిచ్చి -ఆదుకొంటిని నిరతము నన్ను||నీవే||

4.      సీయోనులో మాతో ఉంటూ-మమ్ము నెంతో దీవించితివి

నీవు కోరిన చోటులనెల్ల-నీదు ప్రేమను ప్రకటించేదము||నీవే||

5.      పరమును నందు నీవు నాకు- స్థలము సిద్ద పర్చినావు

 

నీవు నాకై వత్తువనియు-నిరీక్షణ తో కనిపెట్టెదన్||నీవే||