నీవెన్నాళ్ళు రెండు తలంపులతో

నీవెన్నాళ్ళు రెండు తలంపులతో

కుంటి కుంటి నడిచెదవీవు

యెహోవాయే నీ దేవుడా

లేక వేరే దేవతలున్నారా (2)

 

మనం తీర్మానించెదమిప్పుడే

మన నోట వంచన లేకుండా (2)

మరుగైన పాపములన్నిటిన్

హృదయమునుండి తొలగించెదం (2)           ||నీవెన్నాళ్ళు||

 

మారు మనస్సు పొందెదమిప్పుడే

జీవిత మోసములనుండి (2)

పరిశుధ్ధులమై నిర్దోషులుగా

ప్రభు దినమందు కనబడెదం (2)               ||నీవెన్నాళ్ళు||

 

నేను నా ఇంటివారలము

యెహోవానే సేవించెదము (2)

నీవెవరిని సేవించెదవో

 

ఈ దినమే తీర్మానించుకో (2)                   ||నీవెన్నాళ్ళు||