నీవు లేని రోజు అసలు రోజే కాదయా

నీవు లేని రోజు అసలు రోజే కాదయా

నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా (2)

నీవే లేకపోతే నేనసలే లేనయా (2)          ||నీవు లేని||

 

బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు

నా కన్నీరు తుడచి నా చేయి పట్టావు (2)

నన్ను విడువనన్నవు నా దేవుడైనావు (2)           ||నీవే||

 

ఈ నాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే

నేను కలిగియున్నవన్ని నీదు కృపా భాగ్యమే (2)

 

నీవు నా సొత్తన్నావు కృపాక్షేమమిచ్చావు (2)       ||నీవే||