నీవున్న నా గృహము – ఆనంద నిలయము

నీవున్న నా గృహము – ఆనంద నిలయము

నాకున్న ఈ సర్వము – ప్రభు నీవిచ్చిన స్వాస్థ్యము

అ.ప : ప్రభు స్తుతియించెదన్ – నిను ప్రణుతించెదన్

నేనూ నా యింవారితో

1. నీవే గృహమును కట్టనిచో పనివారి ప్రయాస వ్యర్థమే

నీవే కరుణ చూపనిచో అనుభవించుట అసాధ్యమే

2. నీవే కావలి కాయనిచో మేల్కొనియుండుట వ్యర్థమే

నీవే తాలిమి చూపనిచో జీవించుట ఇల అసాధ్యమే

3. నీవే కృపగల దేవుడవు – మేలులతో తృప్తి పరచెదవు

 

నీవే సర్వసమర్థుడవు – సమృద్ధితో నను నింపెదవు