నీవుంటే నాకు చాలు యేసయ్యా

నీవుంటే నాకు చాలు యేసయ్యా

నీవెంటే నేను ఉంటానేసయ్యా (2)

నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా

నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా (2)         ||నీవుంటే||

 

ఎన్ని బాధలున్ననూ ఇబ్బందులైననూ

ఎంత కష్టమొచ్చినా నిష్టూరమైననూ (2)          ||నీ మాట||

 

బ్రతుకు నావ పగిలినా కడలి పాలైననూ

అలలు ముంచి వేసినా ఆశలు అనగారినా (2)    ||నీ మాట||

 

ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా

ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా (2)        ||నీ మాట||

 

నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము

 

నీదు కృపతో నాకేమియు కాదిల సమానము (2) ||నీ మాట||