నీవిచ్చే కొలది కలగును వృద్ధి దేవుని సన్నిధిలో

నీవిచ్చే కొలది కలగును వృద్ధి దేవుని సన్నిధిలో

బిగబట్టే కొద్దీ తరుగును వృద్ధ్ది జీవిత గమనంలో

అర్పణయే నీ మార్గం పొందుకొనే ఓ సూత్రం

ఇదియేసమయందేవునికిచ్చుటకు

1 నీకు కలిగిన సంపదలన్నియు అయన సొంతం

నీకు కలిగిన పాడి పంటలు ఆయన దానమే

పేరు మాత్రం నీది వృద్ది చేసేది ఆయనే

ఆయనదే ఆయనకిచ్చుట దిగులెందుకు

మరి ఆయనకే ఇచ్చుటలో వెలితెందుకు

ఇదియే సమయం దేవునికిచ్చుటకు

2 ప్రతి వస్తువులో పదియవా వంతు ఆయన సొంతమే

ప్రతి వస్తువులో ప్రథమ ఫలము ఆయనకు ఇష్టమే

ఆయన తినుటకు కాదు నీ మనసు ఎరుగుటకొరకే

వేయి కొండల మీద పశువులు ఆయనవే గదా

లోకము దాని సంపూర్ణతయు ఆయనవే గదా

ఇదియే సమయం దేవునికిచ్చుటకు

3 వెదజల్లి వృద్ది పొందిన వారెందరో కలరు

తక్కువ ఇచ్చి లేమికి వచ్చిన వారెందరో కలరు

బీద విధవరాలు కలిగినదంతయు ఇచ్చె గదా

ఇచ్చే ప్రతి వాడు దేవునికే గదా

నీవు ఆరీతిగానే వృద్ధిని పొందెదవు

 

ఇదియే సమయం దేవుని కిచ్చుటకు