నీలాల కన్నుల్లో కన్నీరు నీకేలా చిన్ని ప్రాణమా నాకున్నా నేస్తమా

నీలాల కన్నుల్లో కన్నీరు నీకేలా చిన్ని ప్రాణమా నాకున్నా నేస్తమా

నిను గన్న తండ్రి యేసు నీతోడు ఉండగా

కలత ఏలనే?కన్నీరు ఏలనే?

1.కన్న కలలన్నీ కన్నీటి వ్యధలైపోగా

  మదిని తొలిచే వేదన నిన్ను కలచి వేసినను

కన్నతండ్రి యేసయ్య నీ కనుల ముందర నిలువగా

కడలి అలవలే కష్టములన్ని కరిగిపోవునుగా

ఏల వేదన?నీకే లచింత?ఎదలోపలంతా గత భారమేనా

నీ చింతలన్నీ నీ భారమంతా సిలువ లో ప్రభు మోసెను

2.కలిమి లేములలో ఆత్మీయ బంధువు యేసయ్య

కరుణగల నిజ స్నేహితుడై నిను ఆదరించెనుగా

గాయపడిన చేతితో నీ కన్నుల కన్నీరు తుడవగా

హృదయవేదన ఎరిగి యేసు నిన్ను ప్రేమించున్

నీ అడుగు జాడలు ఎరిగిన యేసు నిన్ను

విడువడెన్నడు ఎడబాయడెప్పుడు

 

నిన్న నేడు రేపు ఏకరీతిగా వున్న యేసుక్రీస్తును ప్రార్థించు.