నీదు సన్నిధానమందు

1.నీదు సన్నిధానమందు

ఓ నా యేసు రక్షకా

నాదు నాకేమీ చేరి యందు

నెంత తృప్తి పొందును

ఎంత శ్రేష్టమైన బోధ

నేను నేర్చుకొందును

నీతి మార్గమందు నడ్వ

నెంత ధైర్య మెుందుదున్!

2.లోక ధనాపేక్షయైన

నన్ను మెాసపుచ్చడు

ఇహ దుఃఖ బాధ లెన

నన్ను భయపర్చవు

నా విరోధియైన సాతాన్

నన్ను వెంబడించినన్

నీదు సన్నిధాన మందు

యేసు నన్ను దాఁగనీ

3.యేసు శరణంబువల్ల

కల్గు మధురంబును

నీవు రుచిచూడ వాంఛ

నీకుఁ గల్గి యున్నదా?

యేసు శరణంబుఁ జొచ్చు

నిధి నీకు లాభము

ఆయన స్వరూప మిట్లు

 

నీకుఁ గూడఁ గల్గును