నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు

నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు

అంతరిక్షము నధిగమించెను (2)

 

1.నిను ప్రేమించి నీ ఆజ్ఞలను

అనుసరించు మానుజావళికి (2)

నిబంధనను స్థిరముగ జేసి (2)

నిరతము నలరారెడు మా ప్రభువా (2)             ||నీదు||

 

2.వేయి తరముల వరకు సరిగా

విలసిల్లేటి వెలలేని మా (2)

వింతల కృపాంబుధి యగుదువా (2)

యెంతయో నిను స్తుతియుంతుము కోరి (2)             ||నీదు||

 

3.నీ సత్య సంధత్వ మహిమ

నిరతము నిలయం సంస్తుతులకు (2)

మెరసెను నా మదిలోన దేవా (2)

మరువగ లేమి మధుర ప్రేమ (2)             ||నీదు||

 

4.ఎంతైనను నమ్మదగిన

వింతైన నీ విశ్వాస్యత (2)

వాత్సల్యత వెలసెను మాపై (2)

క్రొత్తగా ప్రతి దినము యేసు ప్రభు (2)             ||నీదు||

 

మన ఆత్మను జీవము దేహమును

మన ప్రభు యేసు రాకడ వరకు (2)

వొనరుగ కాపాడును పదిలముగా (2)

దిన దినమును నిందారహితముగా (2)             ||నీదు||

 

తండ్రి కుమార శుద్ధాత్మకును

తర తరములకు మహిమ ఘనత (2)

పరిపూర్ణముగా ప్రబలును గాక (2)

 

పరి పరి విధముల ప్రభు సంఘములో (2)             ||నీదు||