నీదు ప్రేమకు హద్దులేదయా

నీదు ప్రేమకు హద్దు లేదయా

నీదు ప్రేమకు కొలత లేదయా

నీదు ప్రేమకు సాటి రారయా.. ఎవ్వరు

పొగడదగిన ప్రేమమూర్తివి నీవయా.. యేసయ్యా       ||నీదు||

 

తల్లి తండ్రులు చూపలేని ప్రేమ

తనయులివ్వని తేటనైన ప్రేమ (2)

పేదలకు నిరు పేదలకు

విధవలకు అనాథలకు (2)

బంధు మిత్రులు చూపలేని ప్రేమా (2)

కొనియాడదగిన ప్రేమమూర్తివి నీవయా.. యేసయ్యా      ||నీదు||

 

నరులకై నర రూపమైన ప్రేమ

పరము చేర్చగ ప్రాణమిచ్చిన ప్రేమ (2)

దొంగలకు వ్యభిచారులకును

కౄరులకు నర హంతకులకు

మనుజులివ్వని మధురమైన ప్రేమా (2)

 

కీర్తించదగిన ప్రేమమూర్తివి నీవయా.. యేసయ్యా      ||నీదు||