నీతి సూర్యుడు – నా ప్రాణనాధుడు

నీతి సూర్యుడు – నా ప్రాణనాధుడు

మరలా రానైయున్నాడు – నా కోసమే

హల్లెలూయా (4) ఆనందమే (4)

1.ఆనందం పరమానందం పరిశుద్దులందరితో

అంబరాన్ని తాకే ఆ సంబరాలలో

కష్టాలు  కన్నీరంతా తడువబడును

నా రాజు రాకతోనే వీడిపోవును  ||నీతి||

2.మంటి దేహము పోయి మహిమ రూపము దాల్చి

యేసన్నతో నేనుండెదను – ఆ రోజే నీకు నాకు మహదానందం

 

ఆ రోజే నీకు నాకు అత్యానందం ||నీతి||