నీతిగల యెహోవా స్తుతి మీ – ఆత్మతో నర్పించుడి

నీతిగల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి

మీ ఆత్మతో నర్పించుడి దాతయవు మన క్రీస్తు నీతిని

దాల్చుకొని సేవించుడి       ||నీతి||

 

చదల బుడమియు రవియు జలధియు నదులు గిరులును జక్కగా

సదమలంబగు దైవ నామము సర్వదా నుతి జేయును      ||నీతి||

 

సర్వశక్తుని కార్యముల కీ సర్వ రాష్ట్రము లన్నియు

గర్వములు విడి తలలు వంచుచు నుర్విలో నుతిజేయను      ||నీతి||

 

గీత తాండవ వాద్యములచే బ్రీతి పరచెడు సేవతో

పాతకంబులు పరిహరించెడు దాతనే సేవించుడి      ||నీతి||

 

పరమ దూతలు నరులు పుడమిని మొరలుబెట్టుచు దేవుని

పరము నందున్నట్టి యేసుని పాదములు సేవింతురు      ||నీతి||

 

ఇలను భక్తులు గూడుకొనియా బలము గల్గిన దేవుని

వెలయు స్తుతి వే నోళ్ళతోడను విసుగు జెందక జేయుడి      ||నీతి||

 

ఆత్మ నీవిక మేలుకొని శు ధ్ధాత్మ యేసుని దండ్రిని

త్రిత్వమగునా యేక దేవుని హర్షమున సేవింపవే      ||నీతి||