నీచిత్తమే నాలో నేరవేర్చిన దేవా

నీచిత్తమే నాలో నేరవేర్చిన దేవా

నీ సేవకే నన్ను పిలిచిన నా ప్రభువా

నా జీవితం నీకంకితం – నా సమస్తం నీకంకితం

అను.ప:నిను కీర్తింతును నిను ధ్యానింతును

నిను ప్రార్ధింతును నిను ప్రకటింతును॥2

1.సమూయేలుతో మాట్లాడి నీవు

న్యాయాధిపతిగా పిలిచితివి

గర్భమునుండగ యిర్మియాను

నీ ప్రవక్తగ చేసితివీ

నన్ను పిలిచిన దేవా ఎన్నుకొన్న దేవా

ప్రేమ చూపిన దేవా దీవెనలిచ్చిన దేవా ॥నిన్ను కీర్తింతును॥

2.పేతురుతోనీవు మాట్లాడితివి

నా సంఘమును కట్టుమనీ

సౌలును పిలిచీ పౌలుగ మార్చి

నీ రూపములో నిలిపితివీ

నన్ను పిలిచిన దేవా

నన్ను దర్శించిన దేవా

నన్ను మార్చిన దేవా

నన్ను నిలిపిన దేవా ॥నిన్ను కీర్తింతును॥

 

నీ చిత్తమే నాలో॥