నిలుచుచున్నవి మా పాదములునీ గుమ్మములో యెరుషలేమా

నిలుచుచున్నవి మా పాదములునీ గుమ్మములో యెరుషలేమా

అ.ప: దేవుని స్వాస్థ్యమా – వాగ్దాన దేశమ

1.క్రీస్తుపాదములు తాకిన పుణ్యక్షేత్రమా

అద్భుతములు చేయబడిన ధన్యప్రాంతమా

రక్షణ కార్యానికి కేంద్రనగరమా

2. నజరేయుడు బలియైన శుభప్రదేశమా

పరిశుద్ధాత్మ దిగివచ్చిన ఘననివాసమా

అపోస్తులుల పరిచర్యకు సాక్షనగరమా

3. విశ్వాసుల తండ్రి అబ్రహాం పర్వతమా

మెల్కీ సెదెకు పాలించిన షాలేంపురమా

మెస్సీయ రాకతో వెలిగే దివ్యనగరమా

4. సోలోమోను మందిర మహిమ రాజ్యమా

శోభాతిశయమైన నీతిదీపమా

 

దావీదు సింహాసన భాగ్యనగరమా