నిరంతరం నీతోనే జీవించాలనే

నిరంతరం నీతోనే జీవించాలనే – ఆశ నన్నిల బ్రతికించుచున్నది

నాప్రాణేశ్వరా యేసయ్యా – నా సర్వస్వమా…యేసయ్యా..

 

1.చీకటిలో నేనున్నప్పుడు – నీ వెలుగు నాపై ఉదయించెనునీలోనే నేను వెలగాలని – నీ మహిమ నాలో నిలవాలని (2)

పరిశుద్ధాత్మ అభిషేకముతో – నన్ను నింపుచున్నావు- నీరాకడకై..

 

2. నీ రూపము నేను కోల్పోయినా – నీ రక్తముతో కడిగితివినీతోనే నేను నడవాలని – నీ వలెనే నేను మారాలని (2)

పరిశుద్ధాత్మ వరములతో – అలంకరించుచున్నావు – నీరాకడకై..

 

3. తొలకరి వర్షపు జల్లులలో – నీ పొలములోనే నాటితివినీలోనే చిగురించాలని – నీలోనే పుష్పించాలని (2)

 

పరిశుద్ధాత్మ వర్షముతో -సిద్ద పరచుచున్నావు – నీరాకడకై.