నిన్న నేడు రేపు మారని దేవుడు నీవు

నిన్న నేడు రేపు మారని దేవుడు నీవు

మనుషులు మారిన మమతల తరిగిన

మార్పులేని దేవుడు నీవ్ . . (2)

 

1. అబ్రహామును పిలిచావు యాకోబును దర్శించావు

తరగని ప్రేమతో కృపతో నింపి మెండుగా దీవించావు

ఈనాటికైనా ఏనాటికైనా మార్పులేని దేవుడు నీవు . .

 

2. యోసేపును హెచ్చించావు దావీదును ప్రేమించావు

శ్రమలోనైనా ధైర్యము నింపి సర్వము సమకూర్చావు

ఈనాటికైనా, ఏనాటికైనా మార్పులేని దేవుడు నీవు . .

 

3. జీవపు మార్గము చూపించి ఆశ్రయ పురముకు

నడిపించి నీ దయ నాపై కురిపించి నెమ్మది కలిగించావు

 

ఈనాటికైనా, ఏనాటికైనా మార్పులేని దేవుడు నీవు .