నిన్నేగా పుట్టుక నేడంత నడక రేపెమో చితికా

నిన్నేగా పుట్టుక  నేడంత నడక రేపెమో చితికా 

మున్నాళ్ల బ్రతుకా భోగాలు కావాలంటూ పాదం భూమిని చుట్టేశాక

ఆగాలి ఏదో చోట కాలం మొత్తం పూర్తయ్యాక

నాధంటే నాధనుకుంటూ ఎంతో కొంత పోగేసాక

నా వెంట వచ్చేదెంటని చూస్తే శూన్యం అంతా వెనుక  ” నిన్నేగా”

1.మంచుకు విరిసేటి పువ్వులు మాధిరి కాదా

ఎండకు వాడాలని అవి సూచించుట లేదా

తేనె ఉందని మురిసే లోగా తుమ్మెద రాదా

మాయగా మకరంధం పువ్వును విడిచి పోదా        “మంచుకు”

బంధం అనుభంధం లోకంతో సంభంధం

గాలికి రాలేటి పువ్వులదా ఈ చంధం

మాయగా మనుషి నెల రాలి వేల్లిపోతుంటే  ” నిన్నేగా”

2.పువ్వుల సువాసనే మనిషికి పాటం కాదా

నీతిని వెదజల్లాలని నేర్పించుట లెదా

పరిమళ వాసనగ క్రీస్తు బలి కాలేదా

ఆఖరు నా హృధయం నీలో ఉందా లేదా

మాయను నమ్మోద్దు మాయ చేసి బ్రతుకొద్దు

నేత్రాశకు లొంగి నిన్ను పొడుచుకోవద్దు

 

లోతు భార్య వలె వెనుక తిరిగి చూడొద్దు  ” నిన్నేగా”