నిన్ను తలచి నను నేను మరచి

నిన్ను తలచి నను నేను మరచి

నీ సాక్షిగా ఇల నే బ్రతుకుచుంటిని (2)

యేసయ్యా.. నీ కృప లేక నే బ్రతుకలేను (2)     ||నిను తలచి||

 

జీవము లేని దైవారాధనలో

నిర్జీవ క్రియలతో మృతుడనైతిని (2)

జీవాధిపతివై నా జీవితానికి

నిత్య జీవము నొసగిన యేసయ్యా (2)     ||నిను తలచి||

 

దారే తెలియని కారు చీకటిలో

బ్రతుకే భారమై నలిగిపోతిని (2)

నీతి సూర్యుడా ఎదలో ఉదయించి

బ్రతుకే వెలుగుతో నింపిన యేసయ్యా (2)     ||నిను తలచి||

 

సద్గుణ శీలుడా సుగుణాలు చూచి

హృదిలో నేను మురిసిపోతిని (2)

సుగుణాలు చూచుటకే నీవు

 

సిలువలో నాకై నలిగిన యేసయ్యా (2)     ||నిను తలచి||