నిన్ను కాపాడు దేవుడు

నిన్ను కాపాడు దేవుడు

కునుకడు నిదురపోడు నిదురపోడు

వాగ్ధానమిచ్చి

మాట తప్పడు నమ్మదగినవాడు నమ్మదగినవాడు

భయమేల నీకు దిగులేల నీకు (2)

ఆదరించు యేసు దేవుడు ఉండగా          ||నిన్ను కాపాడు||

 

శత్రు బలము నిన్ను చుట్టుముట్టినా

శోధనలలో నిన్ను నెట్టినా (2)

కోడి తన పిల్లలను కాచునంతగా

కాపాడు దేవుడు నీకు ఉండగా (2)

భయమేల నీకు దిగులేల నీకు (2)

కాపాడు గొప్ప దేవుడు ఉండగా          ||నిన్ను కాపాడు||

 

రోగ భారమందు లేవకున్ననూ

వ్యాధులు నిన్ను కృంగదీసినా (2)

చనిపోయిన లాజరును తిరిగి లేపిన

స్వస్థపరచు దేవుడు నీకు ఉండగా (2)

భయమేల నీకు దిగులేల నీకు (2)

స్వస్థపరచు సత్య దేవుడు ఉండగా          ||నిన్ను కాపాడు||

Bottom of Form

Bottom of Form

Bottom of Form