నిజముగా మొర పెట్టిన

నిజముగా మొర పెట్టిన

దేవుడాలకించకుండునా

సహనముతో కనిపెట్టిన

సమాధానమీయకుండునా

జీవముగల దేవుడు మౌనముగా ఉండునా

తన పిల్లలకాయన మేలు చేయకుండునా (2) ||నిజముగా||

 

పరలోక తండ్రినడిగిన

మంచి ఈవులీయకుండునా (2)

కరములెత్తి ప్రార్థించినా

దీవెనలు కురియకుండునా (2)       ||జీవముగల||

 

సృష్టి కర్త అయిన ప్రభువుకు

మన అక్కర తెలియకుండునా (2)

సరి అయిన సమయానికి

దయచేయక ఊరకుండునా (2)         ||జీవముగల||

 

సర్వశక్తుడైన ప్రభువుకు

సాధ్యము కానిదుండునా (2)

తన మహిమ కనపరచుటకు

 

దయ చేయక ఊరకుండునా (2)       ||జీవముగల||