నింగిలో నేలలో నా యేసు మహిమ చూడు

నింగిలో నేలలో నా యేసు మహిమ చూడు

తారలో తీరంలో నా యేసు ఘనత చూడు

జలధారలో జీవరాశిలో-నా యేసుని ప్రేమ చూడు

జీవమిచ్చిన జీవదాతను జీవితాంతము కొనియాడిపాడు       ”నింగి

1.ఆకాశం దేవుని మహిమను వివరించుచుండగా

అంతరిక్షము ఆయన పనిని ప్రచురపరచుచుండగా(2)

ఆయన రూపులో చేయబడిన నీవు నీ సృష్టకర్తను స్మరణ చేయుము(2)

అనుదినకృపతో నిను బలపరి ఆదరించు యేసయ్య  (2)     ”నింగి

2.అవసరతెరిగి కొరతలు తీర్చి పోషించు దేవుడు యేసు

ఆపదలో అండగ వుండి ఓదార్చు దేవుడు యేసు

 

ఆశనిరాశల జీవిత పయనములో ఓ మంచి స్నేహితుడై నిను నడిపించును