నా హృదయసీమలో రాజువు నీవే దేవా

నా హృదయసీమలో  రాజువు నీవే దేవా

నా ప్రేమనగరిలో ప్రియుడవు నీవే ప్రభువా – 2

నా ప్రాణమా   నా సర్వమా

 నా సమస్తమా  నా ఏసయ్యా

1.నాహృదయమనే సింహాసనమే నీకిచ్చియున్నానయా

రాజుగనీవే నా జీవితమునే పరిపాలించుమయా – 2

రాజా నీమార్గములో నన్నునడుపుమయ్యా

రారాజా నీసన్నిధిలో నన్నునిలుపుమయ్యా

నా ప్రాణమా  నా సర్వమా

నా సమస్తమా  నా ఏసయ్యా

2.నా హృదయమునే బలియాగముగా అర్పించుచున్నానయా

ప్రియుడా నీవే  నాఅర్పణను అంగీకరించుమయా – 2

ప్రియుడా నీప్రేమతొనన్ను ఆకర్షించుమయా

నాప్రియుడా నీప్రేమతొనన్ను ఆదరించుమయ్యా – 2

నా ప్రాణమా  నా సర్వమా

 

నా సమస్తమా నా ఏసయ్యా –2