నా స్తుతి పాత్రుడా – నా యేసయ్యా

నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా

నా ఆరాధనకు నీవె యోగ్యుడవయ్యా (2)

 

నీ వాక్యమే నా పరవశము

నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము (2)

నీ వాక్యమే నా పాదములకు దీపము (3)    ||నా స్తుతి పాత్రుడా||

 

నీ కృపయే నా ఆశ్రయము

నీ కృపయే నా ఆత్మకు అభిషేకము (2)

నీ కృపయే నా జీవన ఆధారము (3)    ||నా స్తుతి పాత్రుడా||

 

నీ సౌందర్యము యెరూషలేము

నీ పరిపూర్ణత సీయోను శిఖరము (2)

 

నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము (3)    ||నా స్తుతి పాత్రుడా||