నా సఖీ నీవు సౌందర్యవంతురాలవు

నా సఖీ నీవు సౌందర్యవంతురాలవు

నీ పెదవులు చూడగా తేనియ లొలుకుచున్నవి

ప్రేమ సంతోషం సమాధానము చూపుతూ

కడవరకు స్థిరపడి నిలకడ కొనసాగుమా ఆ.. ఆ ..

ఆరువందల అరువది ఆరు ముద్ర ధరణి లో దాగియుండగా

ఉపచారము చేయుచుండుమా అపచారము మానివేయుమా ||నా సఖీ||

1.మనస్సు పెట్టబోకు ధనం మీద

ధనం మీద ఆశతో ప్రభుని ఎదురుచూసి మోసపోకు సోదరా ||ఆరు|| ||నా సఖీ||

2.దుష్ట క్రియలు అక్రమములు క్రమపరచే కత్తెర

వాక్యమనే కత్తెరలో కత్తిరించబడవలె ||ఆరు|| ||నా సఖీ||

3.పదిలముగా కట్టుకొనుము పదిమందిని బాగు చేయుము

 

నీతి నడుము కట్టుకొని ఢాలు చేతబట్టుకొని ||ఆరు|| ||నా సఖీ||