నా సంకట దుఃఖములెల్ల తీరిపోయెగా

నా సంకట దుఃఖములెల్ల తీరిపోయెగా

నశింపజేయు దూత నన్ను దాటిపోయెను (2)   ||నా సంకట||

 

విలువైన గొర్రెపిల్ల రక్తము ద్వారా (2)

కలిగియున్న రక్షణలో దాగియుంటిని (2)           ||నా సంకట||

 

ఇంకా నేను ఫరోకు దాసుడను కాను (2)

ఇంకా నేను సీయోను కన్యుడను గాను (2)           ||నా సంకట||

 

మార్చబడు నాడు మారా మధురముగా (2)

పారు జలము బండనుండి త్రాగుచుండును (2)           ||నా సంకట||

 

సౌందర్యమయమగు పరమ కానాను (2)

నా నిత్యమైన స్వాస్థ్యమది మార్పుజెందదు (2)           ||నా సంకట||

 

ఆనందమే పరమానందమే (2)

కానాను జీవితము నా కానందమే (2)           ||నా సంకట||

 

నా దేవుడే ఎడారిలో నాదు ప్రభువు (2)

నా దేవుడిచ్చు క్రొత్త మన్నా నాకు చాలును (2)           ||నా సంకట||

 

నా యేసు ప్రభువే నా బలము గానము (2)

 

నా యేసు ప్రభువే నా రక్షణ హల్లెలూయా (2)           ||నా సంకట||