నా వేదనలో ఆవేదనలో

నా వేదనలో  ఆవేదనలో

నీ వాక్యమే నను బ్రతికించినది

నా రోదనలో నా యాతనలో

నీ మాటలే నను ఓదార్చినవి

యేసయ్యా…….యేసయ్యా……

1చేయని నేరము చేసెను గాయము

వేసిన నేపము మోపెను భారము

నా కృప చాలునే అన్న  నీ మాటే

నను బ్రతికెంచనయా……..

యేసయ్యా. ….యేసయ్యా….

నీ వాత్సల్యమునే మారువలేనయా

2 చేసిన మేలే కీడుగ మారె

చూపిన ప్రేమ చేదుగా మిగిలే

ఒంటరినైన నన్ను చేరదీసావే

నన్ను ఆదరించినావే (నడిపించినావే)

యేసయ్యా…….యేసయ్యా…..

 

నీ మమకారమునే మరువ లేనయ్యా