నా యేసూ నీ పాదాల చెంతా

నా యేసూ నీ పాదాల చెంతా

నే ధ్యానింతును జీవితమంతా (2)

మరువను దేవా నీ సిలువ త్యాగము

విడువను ప్రభువా విలువైన భాగ్యము (2)

పూర్ణ మనస్సుతోపూర్ణ బలముతో

పూర్ణాత్మతో నిన్ను ప్రేమింతును     ||నా యేసూ||

 

పలుమార్లు నిన్ను నే వీడినాను

నీ గాయాలను నే రేపినాను (2)

కోపించక ఎప్పుడూనా రాకకై

నీ కరుణించే కనుచూపుతో

కాంక్షతో వీక్షించిన దేవా        ||మరువను||

 

నీ శ్రేష్ట పిలుపును నే త్రోసినాను

నీ హృదయాన్ని క్షోభ పెట్టినాను (2)

విసుగక ఎప్పుడూనా ప్రార్థనకై

నీ ప్రేమించే పూర్ణ మనస్సుతో

 

వాంఛతో వేచిన దేవా        ||మరువను||