నా యేసు రాజ్యము అందమైన రాజ్యము

నా యేసు రాజ్యము అందమైన రాజ్యము

అందులో నేను నివసింతును (2)

సూర్య చంద్రులు అక్కర లేని రాజ్యం

ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం (2)          ||నా యేసు||

 

అవినీతియే ఉండని రాజ్యము

ఆకలి దప్పికలు లేని నిత్య రాజ్యం (2)

ఇక కరువు కష్టం వ్యాధి బాధ లేని రాజ్యం

ఇక లంచం మోసం మొహం ద్వేషం లేని రాజ్యం (2)        ||నా యేసు||

 

హల్లెలూయా స్తుతులున్న రాజ్యం

యేసే సర్వాధిపతి అయినా సత్య రాజ్యం (2)

ప్రేమ శాంతి సమాధానం నిత్యం ఉన్న రాజ్యం

 

నీతి న్యాయం ధర్మం సంతోషం ఉన్న రాజ్యం (2)        ||నా యేసు||