నా యేసు రాజుతో నేను సాగి పోదును

నా యేసు రాజుతో నేను సాగి పోదును (2)

సాతాను క్రియలెన్నో ఎదురొచ్చినా – నేను సాగి వెళ్ళేదను (2)   

సాతనును పార ద్రోలెదను – క్రీస్తులో జయించెదను (2)

నే క్రీస్తులో జయించెదను – నే క్రీస్తులో జయించెదను          

అఅహా అఅహా హల్లెలూయ (3)          

హల్లెలూయ హల్లెలూయ

1.శత్రు సమూహము నను చుట్టినా – లోకము నన్ను నిందించినా-2 యెహోవ నిస్సీ నా ధ్వజము – నాకు తోడై జయ మిచ్చును (2) 

నాకు తోడై జయ మిచ్చును .. సాతనును పార ద్రోలెదను ..

2. శోధన సంద్రము వలె పొంగినా – వ్యాధిబాధలు కృంగ దీసినా (2) 

యెహోవ రాఫా నాకు స్వస్థత నిచ్చి నన్ను నడిపించును (2) 

స్వస్థత నిచ్చి నడిపించును .. సాతనును పార ద్రోలెదను ..

3. ధన సంపదలు నను విడచినా – బంధు మిత్రులు నను మరచినా

యెహోవ రోఫీ నా కాపరి – నన్ను కాచి నడిపించును (2)

నన్ను కాచి నడిపించును .. సాతనును పార ద్రోలెదను ..          

నా యేసు రాజుతో నేను సాగి పోదును (2)

సాతాను క్రియలెన్నో ఎదురొచ్చినా – నేను సాగి వెళ్ళేదను (2)  

సాతనును పార ద్రోలెదను – క్రీస్తులో జయించెదను (2)

క్రీస్తులో జయించెదను – నే క్రీస్తులో జయించెదను          

 

అఅహా అఅహా హల్లెలూయ (3) హల్లెలూయ హల్లెలూయ