నా యెడల నీకున్న తలంపులన్ని

నా యెడల నీకున్న తలంపులన్ని (2)

ఎంతో ఎంతో విస్తారమైనవి యేసయ్య (2)

అవి రమ్యమైనవి అమూల్యమైనవి(2)

నిత్యము నన్నే చూచుచున్నావా యేసయ్య

నాకై నీవు తలంచుచున్నావా (2)          ||నా యెడల||

 

రాజువైన నీవు దాసుడవయ్యావా

దాసుడనైన నన్ను రాజుగా చేయుటకే (2)

అభిషేకించావు అధికారం ఇచ్చావు (2)

పరలోకంలో పరిశుద్ధులతొ సావాసం ఇచ్చావు

నీకే స్తోత్రము యేసయ్య (2)          ||నా యెడల||

 

ధనవంతుడవై ఉండి దరిద్రుడవయ్యావా

దరిద్రుడనైన నన్ను ధనవంతునిగా చేయుటకే (2)

ఐశ్వర్యమిచ్చావు నను ఆశీర్వదించావు (2)

సుఖశాంతులతో నింపి కాపాడుచున్నావు (2)

నీకే స్తోత్రము యేసయ్య (2)          ||నా యెడల||

 

బలవంతుడవై ఉండి బలహీనుడవయ్యావా

బలహీనుడనైన నన్ను బలవంతునిగా చేయుటకే (2)

నా స్తానము నిలిచావు నా శిక్ష భరించావు (2)

నీతిమంతుల సభలో నన్ను నిలబెట్టుచున్నావు

 

నీకే స్తోత్రము యేసయ్య (2)          ||నా యెడల||