నా మనో నేత్రము తెరచి

నా మనో నేత్రము తెరచి

నా కఠిన హృదయమును మార్చి (2)

అంధకారములో నేనుండ (2)

వెదకి నన్ రక్షించితివి (2)       ||నా మనో||

 

నే పాప భారము తోడ

చింతించి వగయుచునుంటి (2)

కల్వరి సిలువలో నా శ్రమలన్ (2)

పొంది నన్ విడిపించితివి (2)         ||నా మనో||

 

ఎన్నాళ్ళు బ్రతికిననేమి

నీకై జీవించెద ప్రభువా (2)

బాధలు శోధనలు శ్రమలలో (2)

ఓదార్చి ఆదుకొంటివయా (2)         ||నా మనో||

 

నీ సన్నిధిని నే కోరి

నీ సన్నిధిలో నే మారి (2)

స్తుతి పాత్రగ ఆరాధింతున్ (2)

 

యుగయుగములు సర్వ యుగములు (2)          ||నా మనో||