నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే

నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే

చావైతే నాకెంతో లాభము ”2″

నే చావను సజీవుడనై యేసయ్య ప్రేమను ప్రకటింతును “2″

నా యేసయ్య ప్రేమను ప్రకటింతును “2″

1.చరణం: గోల్గొతాపై సిలువ మ్రానులో

నా కొరకు ప్రాణమిచ్చిన యేసయ్య “2″

ఏమిచ్చి నీ రుణం నే తీర్చగలను “2″

ఏరీతిగా వర్ణింతును ప్రభు ఏరీతిగా వర్ణింతును” నా మట్టుకైతే”

2. చరణం: పాపులలో ప్రధాన పాపినైన

తన కృపచేత నన్ను రక్షించెను “2″

యేసయ్య ప్రేమ నాలో వికసించెనే “2″

యేసయ్య ప్రేమ నాలో పరిమళించెనే “2″” నా మట్టుకైతే”

3.చరణం: తన కృపచేత నన్ను పిలచి

తన సేవలో నన్ను స్థిరపరచెను “2″

దిక్కులేని నాకు తోడై నిలచి

నీ చెంతకు నన్ను చేర్చుకుంటివే

 

ప్రభు నీ చెంతకు నన్ను చేర్చుకుంటివే “2″   ” నా మట్టుకైతే”