నా బ్రతుకు దినములు అన్ని – నిన్నే స్తుతింతును

నా బ్రతుకు దినములు అన్ని – నిన్నే స్తుతింతును

నా ప్రాణ స్నేహితుడా యేసయ్యా – ఓ మంచి బోధకుడా

నీవు చేసిన ఉపకారములు దేనిని మరువను తండ్రీ

నీవు కార్చిన రక్తపుధారలు మర్చిపోను నా తండ్రి

 

1.కొంచెమైనా మంచిలేదు నాలోన మంచివాడవు నీవే ఎంతైనా

నేను ఎక్కడ ఉన్నా ఎప్పుడు ఐనా

నన్నే చూస్తావు నీవు నాతో వస్తావు

స్నేహితుడా మాట్లాడే దేవుడా”నా”

 

2.పుట్టుకతో పాపం ఉంది నాలోన

బొత్తిగా చెడిపోయాను ఇలలోన

నా స్థితిని గతిని మర్చినావు – నీవే దేవుడవు నాకు చాలిన దేవుడవు

స్నేహితుడా యేసయ్యా – స్నేహితుడా మాట్లాడే దేవుడా”నా”

 

3.శ్రేష్ఠమైన క్రొత్త కీర్తన పాడేదను

నా శేష జీవితం అంతా నీకే అర్పిస్తాను – నా హృదయ పూర్వక అర్పణలన్నీ

స్వీకరించుమయ్యా నాపై ప్రేమ చూపుమయ్యా

 

స్నేహితుడా యేసయ్యా – స్నేహితుడా మాట్లాడే దేవుడా”నా”