నా బాధలన్ని తొలగించినాడు

1.నా బాధలన్ని తొలగించినాడు నా భారమే మోసినాడు

నా దుఃఖ దినములు సరిచేసినాడు సంతోషమే ఇచ్చినాడు

తన కౌగిట చేర్చుకొని నా కన్నీటినే తుడిచినాడు…

నీ తల్లి మరిచినా… నే నిన్ను మరువను అని ఆభయమే ఇచ్చినాడు IIమంచిII

2.నా దీన స్థితిని గమనించినాడు నా గాదనే మార్చినాడు

నే పడిన స్థితిని గుర్తించినాడు తన చేతితో లేపినాడు

నా గాయములన్ని కడిగి నన్నెంతో ప్రేమించినాడు

తన ప్రేమ చాటే ఓ గాయకునిగా తన స్వరమునే ఇచ్చినాడుIIమంచిII

3.నా పాప శిక్షను భరియించినాడు నా పక్షమే నిలిచినాడు

నా కొరతలన్ని తను తీర్చినాడు నా నింద తొలగించినాడు

నీ నడిగిన అన్నివేళలా నా మనవి మన్నించినాడు

నే వెళ్ళు దారిలో నా తోడు నడిచి నన్నెంతో బలపరిచినాడుIIమంచిII