నా ప్రియుడా యెసయ్యా – నీ కృప లేనిదే నే బ్రతుకలేను

నా ప్రియుడా యెసయ్యా – నీ కృప లేనిదే నే బ్రతుకలేను

క్షణమైనా -నే బ్రతుకలేను –2   నా ప్రియుడా…. ఆ ఆ అ అ

 

1.నీ చేతితోనే నను లేపినావు – నీ చేతిలోనే నను చెక్కుకొంటివి –2

నీ చేతి నీడలో నను దాచుకొంటివి –2   నా ప్రియుడా ॥

 

2. నీ వాక్కులన్ని వాగ్దానములై – నా వాక్కు పంపి స్వస్థత నిచ్చితివి –2

నీ వాగ్దానములు మార్పులేనివి –2    నా ప్రియుడా ॥

 

3.ముందెన్నడూ నేను వెళ్ళనీ – నూతనమైన మార్గములన్నిటిలో 2

నా తోడు నీవై నన్ను నడిపినావు –నా ప్రియుడా

 

4.సర్వోన్నతుడా సర్వకృపానిధి – సర్వసంపదలు నీలోనే యున్నవి2

 

నీవు నా పక్షమై నిలిచి యున్నావు –2 నా ప్రియుడా ॥