నా ప్రియమైన యేసు ప్రభు- వేలాది స్తోత్రములు

నా ప్రియమైన యేసు ప్రభూ-వేలాది స్తోత్రములు

నీవిచ్చిన రక్షణకై దేవా-స్తోత్రము స్తోత్రములు

నీవు చేసిన ఉపకారముకై దేవా-స్తోత్రము స్తోత్రములు

 

1. ఆపద దినములలో-నా ప్రభుని తలచితిని

దేవా నీ దయతోడనే-నాధా ఆశ్రయం పొందితిని ..నా

 

2. ఒక క్షణ సమయములో-నశియించు నా జీవితం

నా హృదయం మార్చితివి-దేవా నీతోనే జీవించుటకై ..నా

 

3. ఈ దినము నే పాడుట-నీవలనే యేసుప్రభూ

 

ఎల్లప్పుడు నే పాడెదన్‌-దేవా నాయందు వసియించుము ..నా