నా ప్రాణ ప్రియుడవు నీవే

నా ప్రాణ ప్రియుడవు నీవే – నా ప్రాణ నాధుడ నీవే –2

ఎవ్వరు లేరు నాకిలలో – నీవే నాకు సర్వము

ఎవ్వరు లేరు నాకిలలో –1

నా దేవా నా ప్రభువా – యేసు –2 నా ప్రాణ॥ 

 

 1. గాఢాంధ కారములో – నీవే నాకు దీపము –2

    భీకర తుఫానులో – నీవే నాకు దుర్గము –2నా ప్రాణ॥ 

 

2. చీకు చింతలలో – కృంగి నేనుండగా –2

 

    నా చెంతకు చేరి – నా చింతలు బాపితివే –2 నా ప్రాణ॥