నా ప్రాణామా యెహోవానే నీవు సన్నుతించి కొనియాడు

నా ప్రాణామా యెహోవానే నీవు సన్నుతించి కొనియాడు

నా నాధుడేసుని సన్నిధిలో సుఖశాంతులు కలవు

యేసయ్యా నా యేసయ్యా(2)

నిను వీడి క్షణమైన – నేను బ్రతకాలేను స్వామి”నా ప్రాణమా”

1.యేసులేని జీవితం జీవితమే కాదయ్యా

యేసు ఉన్న జీవితం కలకాలం ఉండునయ్యా(2)

నిను మరిపించే సుఖమే నాకు ఇలలో వొద్దయ్యా

నిన్ను స్మరియించే కష్టమే నాకు ఎంతో మేలయ్యా(2)

నిన్ను వీడి క్షణమైన నేను – బ్రతకలేను స్వామి”నా ప్రాణమా”

2.మంచి దేవుడు యేసు మరచిపోనన్నాడు

మేలులెన్నో నా కొరకు దాచి ఉంచినాడమ్మా(2)

నీవు చూపించే ఆ ప్రేమకు నేను పాత్రుడను కానయ్యా

ఆ ప్రేమలోనే నిరతము నన్ను నడుపుము యేసయ్యా(2)

 

నిను వీడి క్షణమైనా నేను – బ్రతకలేను స్వామి”నా ప్రాణామా”