నా ప్రాణమా నాలో నీవు

నా ప్రాణమా నాలో నీవు

ఎందుకు కృంగియున్నావు

యెహోవాయందే ఇంకను

నిరీక్షణ ఉంచుము నీవు (2)          ||నా ప్రాణమా||

 

ఈతి బాధల్ కఠిన శ్రమలు

అవమానములే కలిగిన వేళ (2)

నీ కొరకే బలియైన యేసు

సిలువను గూర్చి తలపోయుమా (2)

అల్పకాల శ్రమల పిదప

మహిమతో నిను నింపును ప్రభు నా ప్రాణమా (2)        ||నా ప్రాణమా||

 

ఆప్తులంతా నిను వీడిననూ

శత్రువులే నీపై లేచిననూ (2)

తల్లి అయినా మరచినా మరచున్

నేను నిన్ను మరువాననినా (2)

యేసుని ప్రేమన్ తలపోయుమా

ఆశ్రయించు ప్రభుని నా ప్రాణమా (2)        ||నా ప్రాణమా||

 

ఐశ్వర్యమే లేకున్ననూ

సౌఖ్య జీవితమే కరువైననూ (2)

ప్రభు సేవలో ప్రాణములనే

అర్పించవలసి వచ్చిననూ (2)

క్రీస్తునికే అంకితమై ఆనందించు

 

ప్రభు రాకకై కనిపెట్టుమా నా ప్రాణమా (2)     ||నా ప్రాణమా||