నా నోమాటలు – నా హృదయధ్యానము

నా నోమాటలు – నా హృదయధ్యానము

నే పాడు పాటలు – పలికే స్తుతిధ్వానము

నీ దృష్టికి యోగ్యముగా ఉండనీయుమా

నీవే నను కడిగి పునీతముగా చేయుమా

1. నా మానసమంతయు ఘోరపాప భరితమే

నా జీవనమంతయు మలిన సహిత చరితమే

అమలిన అతి పూజ్యుడా నిను చేరి కొలువగా

ఏ యోగ్యత నాలో నే కలిగిలేనుగా

2. అంతరంగమందు నీ శాంతినుండజేయుమా

నా జీవనమంత నీదు కాంతి నిండనీయుమా

మదిలోపలి మలినమెల్ల తొలగించివేయుమా

మహిని తుహిన బిందువంటి రూపునీయుమా